‘బైంసా’లో ఎంపీ సోయం పరామర్శ.. బీజేపీ కార్యకర్తల నిరసన

దిశ, ముధోల్ : మార్చి7న జరిగిన బైంసా అల్లర్లలో జైలు శిక్ష అనుభవిస్తున్న వారి కుటుంబాలను ఎంపీ సోయం బాపురావు సోమవారం పరామర్శించారు. వారి తల్లిదండ్రులను కలిసి ధైర్యం కల్పించారు. జైలులో ఉన్న వారందరినీ బెయిల్ పై తీసుకువస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఆర్థికసాయం చేశారు. అనంతరం ఎంపీ బాపురావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. అమాయకులపై కేసులు వేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. […]

Update: 2021-06-21 06:59 GMT

దిశ, ముధోల్ : మార్చి7న జరిగిన బైంసా అల్లర్లలో జైలు శిక్ష అనుభవిస్తున్న వారి కుటుంబాలను ఎంపీ సోయం బాపురావు సోమవారం పరామర్శించారు. వారి తల్లిదండ్రులను కలిసి ధైర్యం కల్పించారు. జైలులో ఉన్న వారందరినీ బెయిల్ పై తీసుకువస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఆర్థికసాయం చేశారు. అనంతరం ఎంపీ బాపురావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. అమాయకులపై కేసులు వేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

రమాదేవి గోబ్యాక్..

ఎంపీ సోయం బాపురావుతో కలిసి పరామర్శకు వెళ్లిన బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకండి రమాదేవికి బీజేపీ, హిందూ వాహిని కార్యకర్తల నుంచి నిరసన ఎదురైంది. కేసు నమోదైనప్పటి నుంచి బాధిత కుటుంబాలను రమాదేవి పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇన్నిరోజులు రాకుండా ఇప్పుడు ఎంపీతో ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. రమాదేవి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చేసేదేమీ లేక ఆమె వెనుదిరిగి వెళ్లిపోయారు.

Tags:    

Similar News