మందుల కొనుగోళ్లలో మరో భారీ స్కామ్ : ఎంపీ రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్ : దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్లు అందుబాటులో లేవు. మరోవైపు వ్యాక్సిన్ కొరత వలన కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి తాను లేఖ రాసినట్లు పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో మందుల కొనుగోళ్లలో రూ.కోట్ల భారీ కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈఎస్‌ఐ మందుల […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్లు అందుబాటులో లేవు. మరోవైపు వ్యాక్సిన్ కొరత వలన కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి తాను లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో మందుల కొనుగోళ్లలో రూ.కోట్ల భారీ కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో వందల కోట్లు గోల్‌మాల్ జరిగిందని వెల్లడించారు. అంతేకాకుండా కరోనా నియంత్రణలోనూ తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. దీనిపై విచారణ జరిపించాలని ప్రధానికి రాసిన లేఖలో రేవంత్ పేర్కొన్నట్లు తెలిపారు.