నాగర్‌కర్నూల్‌లో కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాట్ల పరిశీలన

దిశ, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని రెడ్‌జోన్ల ఏర్పాట్లను ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ బుధవారం పరిశీలించారు. కంటైన్‌మెంట్ జోన్‌లను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జోన్ పరిధిలోని ప్రజలందరూ వైద్య సిబ్బందికి, పోలీసు సిబ్బందికి సహకరించాలని సూచించారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ఇంటి నుంచి బయటకు రావొద్దని, ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సాకులు చెప్పి బయట తిరిగే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర […]

Update: 2020-04-08 08:36 GMT
నాగర్‌కర్నూల్‌లో కంటైన్‌మెంట్ జోన్ల  ఏర్పాట్ల పరిశీలన
  • whatsapp icon

దిశ, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని రెడ్‌జోన్ల ఏర్పాట్లను ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ బుధవారం పరిశీలించారు. కంటైన్‌మెంట్ జోన్‌లను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జోన్ పరిధిలోని ప్రజలందరూ వైద్య సిబ్బందికి, పోలీసు సిబ్బందికి సహకరించాలని సూచించారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ఇంటి నుంచి బయటకు రావొద్దని, ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సాకులు చెప్పి బయట తిరిగే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్స్, పోలీసు అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: nagar kurnool, mp ramulu, janardhan reddy, coronavirus, lockdown, trsleaders,

Tags:    

Similar News