ఢిల్లీలో ఏం జరిగింది.. ఎందుకు చెప్పట్లేదు !

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు చేశారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తున్న జగన్.. అక్కడ ఏం జరిగిందో… ఎందుకు ప్రజలకు చెప్పట్లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అడగాలనే ఏపీ ప్రజలు ఓట్లు వేశారని దానిపై ఎందుకు పట్టుబట్టడం లేదని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్రపై ప్రేమ కురిపించిన వైసీపీ.. విశాఖ […]

Update: 2020-10-07 05:42 GMT
ఢిల్లీలో ఏం జరిగింది.. ఎందుకు చెప్పట్లేదు !
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు చేశారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తున్న జగన్.. అక్కడ ఏం జరిగిందో… ఎందుకు ప్రజలకు చెప్పట్లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అడగాలనే ఏపీ ప్రజలు ఓట్లు వేశారని దానిపై ఎందుకు పట్టుబట్టడం లేదని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్రపై ప్రేమ కురిపించిన వైసీపీ.. విశాఖ రైల్వేజోన్‌పై ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేకహోదాపై గట్టిగా మాట్లాడిన వైసీపీ ఇప్పుడు ప్రజలకి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.

 

Tags:    

Similar News