ఏపీలో న్యాయవ్యవస్థపై కుట్ర జరుగుతుంది: ఎంపీ రఘురామ

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయవ్యవస్థపై తమిళనాడు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్ దేవానంద్‌లు అసహనం వ్యక్తం చేశారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు సరికాదన్నారు. జై భీమ్ సినిమా చూసిన తర్వాత జస్టిస్ చంద్రుపై విపరీతమైన గౌరవం పెరిగిందని.. ఆయన వ్యాఖ్యలతో అది పూర్తిగా పోయిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై […]

Update: 2021-12-14 04:59 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయవ్యవస్థపై తమిళనాడు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్ దేవానంద్‌లు అసహనం వ్యక్తం చేశారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు సరికాదన్నారు. జై భీమ్ సినిమా చూసిన తర్వాత జస్టిస్ చంద్రుపై విపరీతమైన గౌరవం పెరిగిందని.. ఆయన వ్యాఖ్యలతో అది పూర్తిగా పోయిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. చంద్రు వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మంగళవారం హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రకు లేఖ రాశారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవిగా అభిప్రాయపడ్డారు.

జస్టిస్‌ చంద్రు లాంటి వారి వ్యాఖ్యలు గౌరవనీయమైన సంస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని రఘురామ అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ న్యాయవ్యవస్థపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని.. ఇప్పుడు జస్టిస్ చంద్రు కూడా చేశారని చెప్పుకొచ్చారు. చంద్రు వ్యాఖ్యలు చేయడంలోనూ ఆ ఎంపీ కీలక పాత్ర పోషించారంటూ ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను వైసీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో వేరుగా ప్రచారం చేసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యస్థపై దూషణలు చేసిన వారి జాబితాలో ఆ వైసీపీ ఎంపీ పేరు కూడా ఉందని అయితే అతడిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా జరుగుతున్న ఈ కుట్ర కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రను ఎంపీ రఘురామ కోరారు.

Tags:    

Similar News