రామన్నపేట ప్రజలతో ఎంపీ, ఎమ్మెల్యే చాయ్ ముచ్చట్లు

దిశ, నార్కట్‌పల్లి: రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. ఎంపీ, ఎమ్మెల్యే అయి ఉండి, హోదా మరిచి సాధారణ పౌరుల్లా టీ-స్టాల్ వద్ద బెంచిపై కూర్చొని ఆదివారం టీ తాగారు. వివరాళ్లోకి వెళితే.. ఆదివారం యాదాద్రి భువనగిరిలో జరిగే జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావడానికి వెళ్తోన్న ఎంపీ, ఎమ్మెల్యే మార్గం మధ్యంలో రామన్నపేటలోని టీస్టాల్ వద్ద ఆగారు. అనంతరం అక్కడ […]

Update: 2021-07-25 06:15 GMT

దిశ, నార్కట్‌పల్లి: రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. ఎంపీ, ఎమ్మెల్యే అయి ఉండి, హోదా మరిచి సాధారణ పౌరుల్లా టీ-స్టాల్ వద్ద బెంచిపై కూర్చొని ఆదివారం టీ తాగారు. వివరాళ్లోకి వెళితే.. ఆదివారం యాదాద్రి భువనగిరిలో జరిగే జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావడానికి వెళ్తోన్న ఎంపీ, ఎమ్మెల్యే మార్గం మధ్యంలో రామన్నపేటలోని టీస్టాల్ వద్ద ఆగారు. అనంతరం అక్కడ స్థానికులతో ముచ్చటిస్టూ వారితో కలిసి టీ తాగారు. ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొంది సామాన్య, సాధారణ పౌరునిలా జీవిస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తిని స్థానికులు అభినందిస్తున్నారు. టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కంపాటి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు గోదాసు పృథ్వీరాజ్, కో-ఆప్షన్ సభ్యుడు ఆమేరు ఆసీన్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News