ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతాం
దిశ, ఏపీ బ్యూరో: ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. రేపటి నుంచి జరగనున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీఏసీ భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నుంచి లోక్‌సభాపక్ష నేత ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణ చర్యలు, భారత్-చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్ కోరినట్లు పేర్కొన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. రేపటి నుంచి జరగనున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీఏసీ భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నుంచి లోక్‌సభాపక్ష నేత ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణ చర్యలు, భారత్-చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్ కోరినట్లు పేర్కొన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశాన్ని లెవనెత్తుతూనే ఉంటామని, ప్రత్యేక హోదా అంశంపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరెంట్ మీటర్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.