వరదలతో నష్టపోయిన జిల్లాలను కేంద్రం ఆదుకోవాలి: ఎంపీ మిథున్ రెడ్డి

దిశ, ఏపీ బ్యూరో: అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు కేంద్రం సాయం చేయాలని వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వరదల వల్ల  ఈ మూడు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని లోక్‌సభలో ఆయన వెల్లడించారు. లోక్‌సభలో బుధవారం జీరో అవర్‌లో వరదల అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. సీఎం వైఎస్ జగన్ వరదలతో నష్టపోయిన ప్రాంతాలకు కేంద్రం సాయం చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే […]

Update: 2021-12-08 03:48 GMT
వరదలతో నష్టపోయిన జిల్లాలను కేంద్రం ఆదుకోవాలి: ఎంపీ మిథున్ రెడ్డి
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు కేంద్రం సాయం చేయాలని వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వరదల వల్ల ఈ మూడు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని లోక్‌సభలో ఆయన వెల్లడించారు. లోక్‌సభలో బుధవారం జీరో అవర్‌లో వరదల అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. సీఎం వైఎస్ జగన్ వరదలతో నష్టపోయిన ప్రాంతాలకు కేంద్రం సాయం చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వరద నష్టాన్ని అంచనా వేయటానికి రెండు బృందాలను పంపిందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తక్షణమే కేంద్ర ప్రభుత్వం సాయం అందజేయాలని మిథున్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News