చంపే కంపెనీలు మాకొద్దు: కోమటిరెడ్డి

దిశ, ఇబ్రహీంపట్నం: హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలతో మూసి నది సర్వనాశనం అయిందని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ జరిపి.. ఫార్మా కంపెనీలకు భూములను అప్పనంగా కట్టబెడుతూ.. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని విమర్శించారు. ముచ్చర్ల ఫార్మా సిటీ ఎత్తివేత కోసం రైతులు మరో ఉద్యమానికి సిద్ధంగా […]

Update: 2020-07-06 10:53 GMT

దిశ, ఇబ్రహీంపట్నం: హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలతో మూసి నది సర్వనాశనం అయిందని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ జరిపి.. ఫార్మా కంపెనీలకు భూములను అప్పనంగా కట్టబెడుతూ.. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని విమర్శించారు. ముచ్చర్ల ఫార్మా సిటీ ఎత్తివేత కోసం రైతులు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

రైతులకు ఎకరాకు రూ.12 లక్షలు ఇచ్చి.. ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు కోట్లకు అమ్ముకుంటుందని కోమటి‌రెడ్డి దుయ్యబట్టారు. ఫార్మాసిటీ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే కంపెనీలు తేవాలి కానీ, చంపే కంపెనీలు తీసుకురావొద్దని ప్రభుత్వాన్ని కోరారు. పులి రక్తాన్ని మరిగినట్టు.. కేసీఆర్ కుటుంబం డబ్బుకు దాసోహం అయిందన్నారు. అవసరమైతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేద్దామని రైతులతో అన్నారు.

Tags:    

Similar News