ఎన్ని ఎత్తుగడలు వేసినా.. నన్ను ఆపలేరు: ఎంపీ అరవింద్
దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం గ్రామంలో తెరాస పార్టీ నాయకుల నిరసనల మధ్య ఎంపీ అరవింద్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం గన్నారం గ్రామం లోని సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బీజేపీని కానీ, నన్ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ధన్యవాదాలంటూ ఎద్దేవా చేశారు. గన్నారం గ్రామాన్ని దేశం మొత్తం తలపించే విదంగా చేశారని అన్నారు. గన్నారం గ్రామ సచిలయ కార్యాలయానికి 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు […]
దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం గ్రామంలో తెరాస పార్టీ నాయకుల నిరసనల మధ్య ఎంపీ అరవింద్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం గన్నారం గ్రామం లోని సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బీజేపీని కానీ, నన్ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ధన్యవాదాలంటూ ఎద్దేవా చేశారు. గన్నారం గ్రామాన్ని దేశం మొత్తం తలపించే విదంగా చేశారని అన్నారు.
గన్నారం గ్రామ సచిలయ కార్యాలయానికి 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గన్నారం గ్రామ సర్పంచ్ ను కేంద్ర రాష్ట్ర మంత్రితో కల్పిస్తానన్నారు. హైవే రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి జాబితా తమ దృష్టికి వచ్చిందన్నారు. వారి కుటుంబాలకు త్వరలోనే ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రంలో రూరల్ ఇంచార్జి దినేష్, డిచిపల్లి ఎంపీపీ భూమన్న, నాయిడి రాజన్న, గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ బైరయ్య, కేపీ రెడ్డి, శ్రీనివాస్, రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు.