నిరుద్యోగులకు ఒక్క రూపాయివ్వలే : బండి

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఓ వైపు రైతులు ఆందోళనలు చేపడుతుండగా, రాష్ట్రంలో బీజేపీ నేతలు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లను కేంద్రమే జమచేసిందన్నారు.పండించిన పంటకు రైతు ధర నిర్ణయించడమే కొత్త చట్టం ప్రధాన ఉద్దేశమన్నారు.ఈ చట్టాలను సీఎం కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని బండి సంజయ్ విమర్శించారు.రాష్ట్రంలోని నిరుద్యోగులకు రూ.3వేల భృతి చెల్లిస్తామని […]

Update: 2020-12-25 05:47 GMT
నిరుద్యోగులకు ఒక్క రూపాయివ్వలే : బండి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఓ వైపు రైతులు ఆందోళనలు చేపడుతుండగా, రాష్ట్రంలో బీజేపీ నేతలు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు.

రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లను కేంద్రమే జమచేసిందన్నారు.పండించిన పంటకు రైతు ధర నిర్ణయించడమే కొత్త చట్టం ప్రధాన ఉద్దేశమన్నారు.ఈ చట్టాలను సీఎం కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని బండి సంజయ్ విమర్శించారు.రాష్ట్రంలోని నిరుద్యోగులకు రూ.3వేల భృతి చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కేంద్రమే రూ.1500కోట్లు ఇచ్చిందన్నారు.

Tags:    

Similar News