ఎంపీపీని పరామర్శించిన బండి సంజయ్.. ముందస్తు ప్రణాళితోనే దాడులు
దిశ, రంగారెడ్డి: భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని పోరాడుతున్న మహిళా ఎంపీపీపై స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేయడం దారుణం అని బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే దాడిలో గాయపడి హస్తీనాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీపీని ఆయన బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫార్మాసిటీ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఎలాంటి న్యాయం చేయకుండా.. పనులు చేసుకోవడం […]
దిశ, రంగారెడ్డి: భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని పోరాడుతున్న మహిళా ఎంపీపీపై స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేయడం దారుణం అని బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే దాడిలో గాయపడి హస్తీనాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీపీని ఆయన బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫార్మాసిటీ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఎలాంటి న్యాయం చేయకుండా.. పనులు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ అభివృద్ధికి అడ్డుకాదని, రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలు ముఖ్యమంత్రి డైరెక్షన్‌తోనే జరుతున్నాయని ఆయన విమర్శించారు. పోలీసులు టీఆర్‌ఎస్ కొమ్ముకాస్తూ డిపార్ట్మెంట్‌కు చెడ్డపేరు తెస్తున్నారని అన్నారు. ముందస్తు ప్రణాళికతో వచ్చి ఈ దాడి చేశారని అన్నారు. భైంసాలో కూడా ఓ యువకుడిపై దాడి చేశారని, నాగర్‌కర్నూల్ బీజేపీ అధ్యక్షునిపై పోలీసులు దాడి చేశారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీజేపీ పార్టీపై పోలీసులతో కేసులు నమోదు చేయిస్తున్నారని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు బయపడే పార్టీ కాదని అన్నారు. ముఖ్యమంత్రికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. దాడి చేసిన ఎమ్మెల్యే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దళిత మహిళా ఎంపీపీపై ఏమాత్రం గౌరవం ఉన్నా.. వెంటనే వారిపై దాడికి దిగిన ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.