అలా చేస్తేనే తెలంగాణ ప్రజలు శాంతిస్తారు : ఎంపీ అర్వింద్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌కు నిప్పుపెట్టే వరకు తెలంగాణ ప్రజలు శాంతించరని హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ సర్వేలపై స్పందించిన ఆయన రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టాలు ఇచ్చేది వాళ్లేనని మళ్లీ వాటిని తగల పెట్టేది కూడా వారేనన్నారు. రెవిన్యూశాఖ చేస్తున్న సర్వే అంతా బూటకమని, టీఆర్ఎస్ వాళ్లు ఎలా చెబితే అలా సర్వే జరుగుతోందన్నారు. నిజామాబాద్ […]

Update: 2021-03-05 08:39 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌కు నిప్పుపెట్టే వరకు తెలంగాణ ప్రజలు శాంతించరని హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ సర్వేలపై స్పందించిన ఆయన రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టాలు ఇచ్చేది వాళ్లేనని మళ్లీ వాటిని తగల పెట్టేది కూడా వారేనన్నారు. రెవిన్యూశాఖ చేస్తున్న సర్వే అంతా బూటకమని, టీఆర్ఎస్ వాళ్లు ఎలా చెబితే అలా సర్వే జరుగుతోందన్నారు. నిజామాబాద్ మేయర్ భర్త భూకబ్జాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వాటిపై ఉత్తుత్తి ఎంక్వైరీ కాదని సాలీడ్ ఎంక్వైరీ జరగాలన్నారు. పాత పట్టాలను పంపిణీ చేశారని, అవి తగలబడి పోయాయని, ప్రస్తుతం వాటి రికార్డులు లేవని దక్షిణ మండల తహసీల్దార్ ఇచ్చిన వివరణను కొట్టిపారేస్తూ రికార్డులు లేకపోతే నీవేందుకున్నావని ఎంపీ మండిపడ్డారు. ఒకవేళ రికార్డులు లేకుంటే పట్టాలు ఎలా ఇస్తారు. బెస్మెంట్ కట్టుకున్న పేదలను కాదని ఇద్దరిద్దరికీ పట్టాలు ఇచ్చి వాళ్ల మధ్య కోట్లాట పెడుతున్నారని, ఖాళీ జాగా ఉందని దానికి పట్టాలు ఇస్తారా? అని రెవిన్యూ అధికారులను ప్రశ్నించారు. ఒక్కసారి ఇచ్చిన పట్టాలను రద్దు చేసినప్పుడు నోటిసులు ఇవ్వాలని.. కానీ, ప్రివీయస్ పేరుతో రెండేళ్లకు ఒక్కరికి పట్టాలను ఇచ్చేది వాళ్లే తిరిగి రికార్డులను తగలబెట్టి మళ్లీ కొత్తవాళ్లకు ఇచ్చి పేదలకు మధ్య చిచ్చు పెడుతారని వ్యాఖ్యానించారు.

నిజామాబాద్ నగరంలోని 10, 11 డివిజన్‌ల పరిధిలో పేదలకు 2005 నుంచి పలు దఫాలుగా పట్టాలు పంపిణీ చేశారు. వాటిలో కొందరు ఇండ్లను నిర్మించుకోగా మరికొందరు కబ్జా చేసిన స్థలంలో ఉన్నారు. కానీ, ఇటీవల కొందరు అక్కడ కొత్త పట్టాలు, పాత పట్టాల పేరిట అమ్మకాలు కోనుగోళ్లు చేపట్టారు. ఈ తతంగం వెనుక నిజామాబాద్ మేయర్ భర్త ఉన్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవిన్యూశాఖ గత కొన్ని రోజులుగా సర్వే చేస్తోంది. శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నగర కార్పొరేటర్లను వెంట బెట్టుకుని రెవెన్యూ అధికారులు చేస్తున్న సర్వే ప్రాంతం నాగారానికి వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల వారు తాము స్థానికంగా భూముల విషయంలో ఎదుర్కుంటున్న సమస్యలను ఎంపీకి ఎకరువు పెట్టారు. దీంతో సర్వే ప్రాంతంలో ఉన్న నిజామాబాద్ దక్షిణ మండలం ఎమ్మార్వోపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News