‘లొట్టపీసు’.. నా మాటలను వక్రీకరిస్తావా కేసీఆర్ : ఎంపీ అరవింద్ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. ‘వెధవ’ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను అదే భాషతో తిప్పికొట్టారు. బీజేపీ కన్నెర్ర చేస్తే కేసీఆర్‌తో పాటు కుటుంబ సభ్యులు భస్మమైపోతారని, నంజుకోని తింటాం అంటూ 2019లోనే చెప్పామని, ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని ట్విట్టర్ ద్వారా వీడియోలో హెచ్చరించారు. ఇందూరులో కవితకు పట్టిన గతే.. పదింతలు పట్టించే రోజు […]
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. ‘వెధవ’ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను అదే భాషతో తిప్పికొట్టారు. బీజేపీ కన్నెర్ర చేస్తే కేసీఆర్‌తో పాటు కుటుంబ సభ్యులు భస్మమైపోతారని, నంజుకోని తింటాం అంటూ 2019లోనే చెప్పామని, ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని ట్విట్టర్ ద్వారా వీడియోలో హెచ్చరించారు.
ఇందూరులో కవితకు పట్టిన గతే.. పదింతలు పట్టించే రోజు దగ్గరలోనే ఉన్నదని అన్నారు. ‘లొట్టపీసు’ అని తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తనను దూషించారని, కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉన్నదంటూ హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో చేసిన మాటలను అరవింద్ గుర్తుచేశారు.
“అన్నింటిలో బెయిల్ వచ్చేసింది. ఒక్కటే కేసు మిగిలింది. అది కూడా ఫస్టుకు విచారణకు ఉన్నది. వాడు ఎవ్వడు లొట్టపీసుగాడు అన్నందుకు తీన్మార్ మల్లన్న మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు పోలీసులు” అని తాను వ్యాఖ్యానిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టాన్నే లొట్టపీసు అన్నట్లుగా వక్రీకరించారని అన్నారు. తనను కేసీఆర్ వెధవ అని తిట్టడాన్ని అరవింద్ తప్పు పట్టారు. ఎస్సీ, ఎస్టీ యాక్టును బలోపేతం చేసిందే బీజేపీ అని, మల్లన్న భార్య దళితురాలు కాబట్టే తాను ఢిల్లీకి తీసుకెళ్ళి అమిత్ షాతో కలిపించానని అరవింద్ గుర్తుచేశారు.
దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోతే మెడలు కోసుకుంటా అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ నేతల నాలుక కోస్తా అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి నేర్పించాల్సిన అవసరం లేదని, రైతుల గురించి గొప్పగా చెప్పుకునే కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో ఏడేళ్ళలో 417 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. బీజేపీ కన్నెర్ర చేస్తే భస్మం తప్పదని, రేపటి నుంచి బీజేపీ అంటే ఏంటో చూపిస్తామన్నారు.
ప్లాన్ మార్చిన టీఆర్‌ఎస్.. పార్టీ కమిటీల్లో వారికి ప్రాధాన్యత