ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు: ఎంపీ అరవింద్

దిశ, కరీంనగర్: తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో అవకతవకలు ఉన్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా చల్గల్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తప్ప, తాలు పేరిట తరుగు తీస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఎలాంటి నియంత్రణ చేయడం లేదని చెప్పారు. కల్వకుంట్ల ఫ్యామీలీ, టీఆర్ఎస్ నాయకులు మాత్రం రైస్ మిల్లర్లతో […]

Update: 2020-05-11 09:54 GMT

దిశ, కరీంనగర్: తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో అవకతవకలు ఉన్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా చల్గల్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తప్ప, తాలు పేరిట తరుగు తీస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఎలాంటి నియంత్రణ చేయడం లేదని చెప్పారు. కల్వకుంట్ల ఫ్యామీలీ, టీఆర్ఎస్ నాయకులు మాత్రం రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయి రైతుల పొట్ట గొడుతున్నారని ఆరోపించారు. రైతుల కష్టంతోనే పంటలు పండాయని.. ఇందులో కేసీఆర్ చేసిన కృషి ఏముందని ప్రశ్నించారు. జిల్లా అధికారులు రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ అరవింద్ కోరారు.

Tags:    

Similar News