ఆ సన్నివేశాలు తొలగించడం బాధ కలిగించింది: దీప్షిక
‘మైఖేల్’ చిత్రంలో పలు సన్నివేశాలను తొలగించడంపై యంగ్ బ్యూటీ దీప్షిక విచారం వ్యక్తం చేసింది..
దిశ, సినిమా : 'మైఖేల్' చిత్రంలో పలు సన్నివేశాలను తొలగించడంపై యంగ్ బ్యూటీ దీప్షిక విచారం వ్యక్తం చేసింది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ మూవీలో కథానాయికగా నటించిన ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'సినిమాలో నేను నటించిన జెన్నీఫర్ పాత్రలో మరొకరు నటించాల్సి ఉంది. కొన్ని కారణాలతో ఆమె తప్పుకోవడంతో నాకు అవకాశం దక్కింది.
దర్శకుడు రంజిత్ జయకొడి చెప్పిన వన్ లైన్ స్టోరీ వినగానే ఫిదా అయ్యాను. మరో ఆలోచన లేకుండా నటించేందుకు ఒప్పుకున్నా. సినిమా మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ప్రజల నుంచి వస్తున్న ప్రశంసలు చూసి పొంగిపోతున్నా' అని చెప్పింది. అయితే విజయ్ సేతుపతికి తనకు మధ్య చిత్రీకరించిన సీన్స్ తొలగించడం చాలా బాధ కలిగించిందన్న దీప్షిక.. ఏదేమైనా మైఖేల్ తనకు గొప్ప అనుభూతినిచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది.