మిస్ యూ నా ప్రతి జ్ఞాపకంలో నువ్వు ఉంటావు.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
నేడు దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ జయంతి అన్న సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: నేడు దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ జయంతి అన్న సంగతి తెలిసిందే. దీంతో మహేష్ బాబు తన సోషల్ మీడియా వేదికగా తండ్రిని తలుచుకొని ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ మిమ్మల్ని నేను చాలా మిస్సవుతున్నాను. నా గుండె లోతుల్లో.. నా ప్రతి జ్ఞాపకంలో నువ్వు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావు’’ అని రాసుకొచ్చాడు. అలాగే తండ్రి కృష్ణ ఫొటో షేర్ చేశాడు. కాగా, కృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని రకాల ప్రయోగాలు చేశాడు.
డైరెక్టర్, నిర్మాతగానే కాకుండా హీరోగా నటించి ఎంతో మంది అభిమానులకు సంపాదించుకున్నాడు. ఎన్నో హిట్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించి చెరగని ముద్ర వేశాడు. కానీ 2022లో హార్ట్ ఎటాక్ రావడంతో సడెన్‌గా మృతి చెంది అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఇప్పటికీ కృష్ణను మర్చిపోలేదు. ఆయన ఫ్యాన్స్ పలు సినిమాలను పదే పదే చూస్తు సూపర్ స్టార్‌ను గుర్తు తెచ్చుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కృష్ణ వారసుడిగా వచ్చి మహేష్ బాబు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. వరుస సినిమాలతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నాడు.