నువ్వే మా జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చావంటూ.. నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
మెగా డాటర్ నిహారిక ఇటీవల తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక ఇటీవల తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి అంగీకారంతోనే వీడిపోతున్నమని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వీరిద్దరి డైవర్స్ తర్వాత నిహారిక నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మెగా డాటర్ స్నేహితులతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. పెళ్లి జ్ఞాపకాలు మర్చిపోవడానికి ఎక్కువ సమయం స్నేహితులతోనే గడుపుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాస్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు కాలభైరవ, నిహారిక మధ్య చిన్నప్పటి నుంచి స్నేహబంధం కొనసాగుతుంది. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ హ్యాపీ బర్త్ డే బాబు.. నువ్వే మా జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చావు థాంక్యూ. లెట్స్ హ్యావ్ ఫన్ డే ’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Read More: కీర్తి సురేష్ పీక పిసికి చంపేయాలనుకున్నా.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్