అబ్బాయి అమ్మాయిగా మారిపోతే.. ఇంజెక్షన్‌తో గుచ్చి చిత్రహింసలు
యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ హన్సిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘పార్ట్ నర్’. మనోజ్ దామోదర్ దర్శకత్వంలో ఆర్‌ఎఫ్‌సి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా నుంచి రీసెంట్‌గా ట్రైలర్ విడుదల చేశారు.
దిశ, సినిమా: యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ హన్సిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘పార్ట్ నర్’. మనోజ్ దామోదర్ దర్శకత్వంలో ఆర్‌ఎఫ్‌సి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా నుంచి రీసెంట్‌గా ట్రైలర్ విడుదల చేశారు. సైంటిఫిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే యోగిబాబు, తన మిత్రుడు ఆదిని కూడా జాబ్ ఇప్పిస్తానని చెప్పి పట్టణానికి తీసుకెళ్తాడు. అలా అక్కడ వారికి ఓ ల్యాబ్‌లో ఓ ఫార్ములా దొంగతనం చేస్తే రూ.20 లక్షలు ఇస్తామని ఒక ఆఫర్ వస్తుంది. ఆ ఫార్ములా కోసం ల్యాబ్‌కు వెళ్లిన యోగిబాబు, ల్యాబ్‌లోని పరిశోధకుడితో గొడవ పడతారు. ఈ గొడవలో యోగిబాబు శరీరంలోకి ఓ మిషన్ ఇంజక్షన్ గుచ్చుకుంటుంది. దీంతో యోగిబాబు అమ్మాయి హన్సికగా మారిపోతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనేది అసలైన కథ.