అవును..పెళ్లికి ముందే గర్భం దాల్చాను: Alia Bhatt
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కలిగివున్న స్టార్ హీరోయిన్ అలియా భట్.
దిశ, సినిమా : బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కలిగివున్న స్టార్ హీరోయిన్ అలియా భట్. ఇక గతేడాది ఏప్రిల్ నెలలో రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన ఎనిమిది నెలలకే ఆడ పిల్లకు జన్మనిచ్చింది అలియా. దీంతో కొంతమంది అలియా భట్ పెళ్లికి ముందే గర్భవతి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఇక ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది అలియా. 'వివాహానికి ముందు బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నా. అయితే అదే సమయానికి నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. దీంతో యాక్షన్ సీన్లు చేయడానికి ఇబ్బంది పడ్డాను. విషయం తెలుసుకున్న చిత్రం యూనిట్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాలో నటించినప్పుడూ నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తొలి రోజుల్లోనే షూటింగ్‌లో పాల్గొన్నా' అంటూ మీడియాతో వివరించింది.
Also Read...
జాన్‌బాజ్ హిందుస్తాన్ కే: రెజీనా కొత్త వెబ్ సిరీస్‌కి టైటిల్ ఫిక్స్!