పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ప్లాన్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
మెగా ఇంటి కోడలిగా లావణ్య త్రిపాఠి త్వరలోనే అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: మెగా ఇంటి కోడలిగా లావణ్య త్రిపాఠి త్వరలోనే అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి వార్తలే వినిపించడంతో పాటు నిశ్చితార్థం ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా అవుతున్నాయి. మొన్నటి వరకు పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న లావణ్య- వరుణ్ లవ్ ఎఫైర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చినా అలాంటిది ఏమీ లేదని దాటవేశారు. చివరకు అనూహ్యంగా నిశ్చితార్థం చేసుకొని ట్విస్ట్ ఇచ్చారు. అయితే లావణ్య పెళ్లి తర్వాత ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయని మెగా అభిమానులలో ఒక ఆలోచన తట్టింది. కాగా, సెలబ్రెటీల పెళ్లిళ్లు అంతగా నిలబడడం లేదు. అందులో ముఖ్యంగా హీరో హీరోయిన్ల పెళ్లిళ్లు. కానీ వరుణ్ మాత్రం వివాహానికి ముందే అన్ని పర్ఫెర్ట్గా మాట్లాడుకున్నరని సమాచారం. దీంతో అందాల రాక్షసి పూర్తిగా సినిమాలకు దూరం అవుతుందట. ఫీమేల్ సెంట్రిక్ మూవీల్లో ఎలాంటి గ్లామర్ షో లేకుండా ఉండే రోల్స్ చేస్తుందని భావిస్తున్నారు. కాగా, ఆఫ్టర్ మ్యారెజ్ లావణ్య తన ఆలోచనల్లో ఛేంజెస్ రావచ్చని అంచనా వేస్తున్నారు.
Read more : మెగా ఫ్యామిలీకి విరుద్ధంగా లావణ్య నిర్ణయం.. షాక్లో నాగబాబు..