Ram Charan : రామ్ చరణ్‌తో ‘ఏజెంట్’.. వీడియో వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఏజెంట్’.

Update: 2023-04-27 11:40 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలకాబోతుంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ఒక్క అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతగానో అంటుకున్నాయి.

అయితే ఇదే ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రం ‘ధృవ’ సూపర్ హిట్ కొట్టిన విషయం తెలుసిందే. కాగా ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఈ వీడియోలో రామ్ చరణ్ ధృవ లాగా.. అఖిల్ ఏజెంట్ లాగా కనిపించగా ‘కబ్ ఆయేగా సాలే’ అంటూ ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది.

Also Read.. ఏజెంట్ మూవీ.. అఖిల్ ఖాతాలో హిట్ట్ పడనట్లేనా? 

Tags:    

Similar News