ఒకే ఒక్క హిట్‌తో.. ప్రభాస్, షారూఖ్‌లను మించిన స్టార్‌డమ్ సంపాదించుకున్న ఆ భామ ఎవరంటే..!

ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDb) ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో, కీలక పాత్ర

Update: 2024-01-19 06:30 GMT

దిశ, సినిమా: ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDb) ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో, కీలక పాత్రపోషించే వెబ్‌సైట్... ఎప్పటికప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలకు రివ్యూ చేసి, రేటింగ్స్ ఇస్తుంది. అలాగే అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 ప్రముఖుల జాబితాను ప్రతివారం విడుదల చేస్తుంది. కాగా ఈ వారం జాబితాను కూడా తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో భాగంగా ఎవరూ ఊహించని ఒక సెలబ్రిటీ ఈ లిస్టులో టాప్ ప్లేస్‌ దక్కించుకుంది. ఇప్పటి వరకు కేవలం మూడు సినిమాలే చేసినా, వాటిలో ఒకటి మాత్రమే హిట్ కాగా.. దీంతో ఏకంగా షారుఖ్ ఖాన్, ప్రభాస్, దీపిక పదుకొణె వంటి పాపులర్ సెలబ్రిటీలకు మించిన స్టార్‌డమ్, పాపులారిటీని ఆమె సొంతం చేసుకుంది.

మరి ఆ సెలబ్రెటి ఎవ్వరో కాదు.. మేధా శంకర్ తాజాగా ‘12th ఫెయిల్’ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఈ నటి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్, క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కాగా జనవరి 16న ముగిసిన వారంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్‌లో మేధా శంకర్ మొదటి స్థానంలో నిలిచింది.

Tags:    

Similar News