ఈ వారం 'Bigg boss' నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనే?

బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రారంభమై నాలుగు వారాలు కావస్తోంది. ఇప్పుడిప్పుడే షో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే షో నుంచి ముగ్గురు కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా.. నాలుగో వారం ఓటింగ్ చివరి రోజు శుక్రవారం అందరి అంచనాలను తారుమారు చేసింది.

Update: 2022-10-01 04:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రారంభమై నాలుగు వారాలు కావస్తోంది. ఇప్పుడిప్పుడే షో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే షో నుంచి ముగ్గురు కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా.. నాలుగో వారం ఓటింగ్ చివరి రోజు శుక్రవారం అందరి అంచనాలను తారుమారు చేసింది. ఈ వారం ఎలిమినేషన్‌లో 10 మంది ఉండగా.. టాప్‌లో రేవంత్ దూసుకుపోతున్నాడు. రేవంత్ భార్య సీమంతం చాలా ఎమోషనల్‌గా సాగింది. ఇప్పటి వరకు ఈ సీజన్ ది బెస్ట్ ఫుటేజ్ కవర్ అయింది.

కానీ, మొదటి నుంచి అందరూ రేవంత్‌ను టార్గెట్ చేసినా ఈ ఫుటేజ్‌తో టాప్-5లోకి రేవంత్ వెళ్ళారు. దీనికి ముందు 22 శాతం ఓట్లు రాగా ఇప్పుడు అది 33 శాతానికి వెళ్లింది. ఇనయాకు 22 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా ఈ వారం ఎలిమినేషన్‌పై విస్తృతమయ్యాయి. ఓటింగ్‌లో ఆర్జే సూర్యకి 3.8 ఓట్లు, సూదీపకు 3.7, ఆరోహికి కేవలం మూడు శాతం ఓట్లే వచ్చాయి. అయితే సూర్యకు ఆరోహి కి లవ్ ట్రాక్ నడుస్తుండటం తో ఈమె ఎలిమినేట్ కావడం కష్టంమే అనిపిస్తుంది. ఈమె కాకుండా సుదీప ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె అని చర్చించుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News