Brahmamudi September 04: రాజ్, కావ్య మూడు ముళ్ల బంధం మధ్యలోనే తెగిపోనుందా?
'బ్రహ్మముడి' ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
దిశ,వెబ్ డెస్క్: 'బ్రహ్మముడి' ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
‘అంటే నా అభిప్రాయాలతోనూ నా కోరికలతో.. మీకేం సంబంధం లేదా.. నేనేం అయిపోయినా మీకు ఫర్వాలేదా.. అని అంటుంది కావ్య కోపంగా. ‘ఇప్పుడు నీకు ఇక్కడ ఏం తక్కువైందని రాజ్ అంటాడు. ‘ప్రేమ తక్కువైంది.. స్థానం తక్కువైంది.. గౌరవం తక్కువైంది.. కలసే బతకాలి’ అంటూ కావ్య మనసులో మాటలు చెబుతుంది. ‘నాకు నీతో ప్రయాణం చేయాలని లేదు.. నా గమ్యం ఇది కాదని రాజ్ అంటాడు. దానితో కావ్య మనసు ముక్కలైపోతుంది. రాజ్ మాత్రం ఎమ్ పట్టనట్లుగా ఉంటాడు. 'నేను మీ నుంచి వెళ్ళిపోవాలి అదేగా కోరుకునేది.. మీరు మారతారని ఇంతకాలం ఎదురు చూశాను. అది ఇక ఎప్పటికి జరగదని ఈ రోజుతో తేలిపోయింది. ఇంకా నేను ఎందుకు ఇక్కడుండాలి? మూడుముళ్ల బంధాన్ని అర్ధమే లేకుండా చేసారు.. మీ అహంకారానికి నా స్త్రీ తత్వం తల వంచలేదు. మీతో కలసి ప్రయాణం చెయ్యలేనప్పుడు నా ప్రయాణం ఇక్కడితోనే ఆపేస్తాను.. అందుకే ఈ రోజు మీ నుంచి నేను శాశ్వతంగా వెళ్లిపోవాలనుకుంటున్నాను’అని తన నిర్ణయాన్ని చెప్పేస్తుంది.
Read More: రెమ్యునరేషన్ అడిగితే బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేశారు.. స్టార్ కమెడియన్ ఆవేదన!