రెండు పడవుల మీద ప్రయాణం చేయబోతున్న పవన్ కళ్యాణ్.. ప్రజల మనసు గెలవగలడా?
జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో 21 విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రికార్డు సృష్టించింది.
దిశ, సినిమా: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి విజయం సాధించారో మనకి తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో 21 విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రికార్డు సృష్టించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఎన్నికల విజయం తర్వాత పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీని కలవడం నుంచి చిరంజీవి ఇంటికి వెళ్లడం వరకు ఇలా అన్ని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. అయితే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ బాధ్యతతో పాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా.. సినిమాల్లో కూడా బిజీ అవ్వనున్నాడు. ఓజీ మూవీ.. చిత్రీకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు చాలా సినిమాలను పూర్తి చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తాడా అని అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇది మాత్రమే కాకుండా పిఠాపురం బాధ్యత మొత్తం పవన్ కళ్యాణ్ మీదే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాడు. కానీ, ఇది అంత సులభం కాదని సినీ పెద్దలు అంటున్నారు.