మనం ప్రేమలో ఉన్నప్పుడు ఆ పని తప్పకుండా చేయాలి: రకుల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకటి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకటి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో సెటిలైపోయింది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే రకుల్ ప్రజంట్ పీకల్లోతు ప్రేమలో ఉంది. తాజాగా ప్రేమలో జరిగే మోసాల గురించి వివరించడంతో పాటు.. ప్రేమలో తనకు నచ్చని విషయాలు కూడా వెల్లడించింది. ‘స్వచ్ఛమైన ప్రేమకు పెద్ద శత్రువు అబద్ధం. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా దాపరికాలు ఉండకూడదు. ఒక వేళ దాపరికాలు ఉంటే వారి ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. ఇక మనిషి అన్నాకా తప్పు చేయకుండా ఉండరు. అది సాధారణం. కానీ చేసిన తప్పులు ఒప్పుకోవడం, అ తప్పును క్షమించగలగడం ఎంతో గొప్ప విషయం. ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు ఒప్పుకోకపోవడం అనేది.. ఆ ప్రేమకు పెద్ద సమస్య’ అని వివరించింది.
Read More... పూజను చిక్కుల్లో పడేస్తున్న ముగ్గురు హీరోయిన్స్ .. ఎలా అంటే?