ఓటీటీలోకి ‘భజే వాయు వేగం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
యంగ్ హీరో కార్తికేయ గుమ్మ కొండ గతేడాది "బెదురులంక" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
దిశ, సినిమా: యంగ్ హీరో కార్తికేయ గుమ్మ కొండ గతేడాది "బెదురులంక" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కొంత సమయం భజే వాయు వేగం మూవీతో మన ముందుకు వచ్చాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ చిత్రంలో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీడేస్ మూవీలో చేసిన రాహుల్ టైసన్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్‌లు, ట్రైలర్‌లు సినిమాపై హైప్‌ని పెంచాయి. మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రమోషన్ అంచనాలను మరింత పెంచేసింది.
మే 31న విడుదలైన భజే వాయు వేగం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో సస్పెన్స్‌తో కూడిన ఎలిమెంట్స్ , క్లైమాక్స్ కూడా సూపర్ అని రివ్యూలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, కార్తికేయ భజే వాయు వేగం మూవీ ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.
థియేట్రికల్ విడుదలైన ఒక నెల తర్వాత, భజే వాయు వేగం చిత్రాన్ని OTTలో విడుదల చేయడానికి ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెలలో ఈ చిత్రాన్ని OTTలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో విడుదల కాకపోతే, జూలై మొదటి వారంలో భజే వాయు వేగం డిజిటల్‌గా OTTలో విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై 'భజే వాయు వేగం' తెరకెక్కింది.