కళ్యాణ్ రామ్ 'Amigos' టీజర్ రిలీజ్!
నందమూరి కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత గతేడాది 'బింబిసార' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
దిశ, సినిమా : నందమూరి కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత గతేడాది 'బింబిసార' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. తాజాగా ఈ మూడు పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్ట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్‌గా ఈ మూవీ నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్‌లో కళ్యాణ్ రామ్ మూడు షేడ్స్‌లో అదరగొట్టాడు. కానీ, ఎక్కడ కూడా సినిమా కాన్సెప్ట్ రివీల్ కాలేదు. ఫిబ్రవరి 10న సినిమా రిలీజ్ అవుతోంది.