టెన్త్ క్లాస్ చదివేటప్పుడే ఆ పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయా మా అమ్మ ఫుల్ కొట్టింది: సుప్రీత
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీత అందరికీ సుపరిచితమే.
దిశ, సినిమా: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీత అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో పలు హాట్ ఫొటోస్ షేర్ చేసి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. అంతేకాకుండా పలు బుల్లితెర షోస్‌కు కూడా హాజరయి మంచి గుర్తింపు సంపాదించుకుంది. సుప్రిత సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల సుప్రీత, బిగ్‌బాస్ అమర్ దీప్ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి కావడంతో పాటు షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. తాజాగా, అమర్- సుప్రీత రితూ చౌదరి దావత్ షోకు హాజరయ్యారు. ఇందులో భాగంగా సుప్రీత తను చిన్నప్పుడు చేసిన పనులకు తల్లి సురేఖా వాణి ఫుల్ కొట్టిందని చెప్పుకొచ్చింది. ఓ గేమ్ ఆడుకుందాం.. క్రాక్‌తో, కిక్, బలుపు, అని రితూ అంటుంది.
దానికి సుప్రిత సమాధానమిస్తూ.. నాకు అప్పుడు లైసెన్స్ లేదు 15,16 అంత వయసులో అప్పుడప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నా. అయితే మా అమ్మ పడుకున్నప్పుడు తెలియకుండా కారు తీసుకొని వెళ్లిపోయి డ్రైవ్ చేసేదాన్ని. నాకు తెలిసి మా అమ్మకు ఎక్కడ దొరికిపోతానో అని చెప్పి భయపడి పోయేదాన్ని. ఒకరోజు నిజంగా అడ్డంగా దొరికిపోవడంతో మా అమ్మ కొట్టింది. ఒక తీట పని కూడా చేశాను. నా టెన్త్ క్లాస్‌లో నాకు ఒక గ్యాంగ్ ఉండేది. అయితే వాళ్లందరికీ స్ప్రైట్‌లో మందు కలుపుకుని తాగాలనే కోరిక ఉండేది. ఆ విషయం నాకు తెలియజేయడంతో నేను మా అమ్మకు తెలియకుండా ఎక్కడి నుండో తెప్పించాను. ఆ తర్వాత తీసుకెళ్లి తాగింపించేశాను. తర్వాత మా కార్డినేటర్కు దొరికి పోయాను’’ అని చెప్తుంది.
ఆ తర్వాత రితూ.. నీ మీద సురేఖ గురించి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి వాటిని చూస్తే రియాక్ట్ అవుతారు అనగా.. దానికి సుప్రిత ‘‘మా నాన్న చనిపోయిన సమయంలో మా అమ్మను రిలాక్స్ చేయడానికి ట్రిప్స్‌కు తీసుకెళ్లేదాన్ని లేదా బయటకు తీసుకుని పోయేదాన్ని. దానికి అందరూ మీకు మీ నాన్న చనిపోయిన బాధ లేదు అని అన్నారు. దీంతో నాకు కోపం వచ్చింది. మీకేం తెలుసు నువ్వు ఏమైనా నా బెడ్రూమ్ లోకి వచ్చి చూస్తున్నావా. మేము ఎంత ఏడుస్తున్నామో మాకు తెలుసు. ఆ బాధ మర్చిపోవడానికి ఏదో ఒకటి చేయాలి. పాజిటివ్‌గా కూడా ఆలోచించాలి కదా. మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు నెగిటివ్‌గా ఆలోచించేవాళ్లు వీడియోలు పోస్టులు చూడటం మానేయండి’’ అంటూ స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసింది. ఇంకా పలు విషయాలపై సుప్రిత పలు విషయాలను పంచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.