నీ బాయ్ ఫ్రెండ్‌కి పట్టిన గతే నీకూ పడుతుంది.. Rashmika పై కేఆర్కే ఘాటు వ్యాఖ్యలు
'ఛలో' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన భామ రష్మి్క మందన.
దిశ, వెబ్‌డెస్క్: 'ఛలో' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన భామ రష్మి్క మందన. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె సౌత్‌లో విజయ్ సరసన నటించిన 'వారిసు' రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. హిందీలో సిద్దార్థ్ మల్హోత్రాతో నటించిన సినిమా సైతం త్వరలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే బీటౌన్‌లో మూవీ క్రిటిక్‌గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ రష్మిక మందనాపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు.
తన ట్విట్టర్ వేదికగా ''మేడం రష్మిక మందనా జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతడిని ఎలా అయితే తరిమి కొట్టారో.. సరిగ్గా నీకు కూడా అదే గతి పట్టిస్తాం. అంతే కాకుండా మిమిల్ని భోజ్‌పురీ చిత్రాల్లో చూడటం మాకు ఆనందంగా ఉందంటూ'' పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ కాగా అతడిపై రష్మిక అభిమానులు మండిపడుతున్నారు. అతడిని తిడుతూ.. రష్మికకు, విజయ్‌కు మద్దతు నిస్తున్నారు నెటిజన్స్.
ఇవి కూడా చదవండి : టాప్ సీక్రెట్ బయటకు లీక్ చేసిన Rashmika Mandanna