‘జవాన్’ నుంచి మీకేం కావాలి చెప్పండి? అంటూ ఫ్యాన్స్‌తో ముచ్చటించిన షారుఖ్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘జవాన్’.
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘జవాన్’. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ్‌లో విడుదల కానుంది. ఇక షారుఖ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇందులో భాగంగా తాజాగా నిర్వహించిన ఆస్క్ మి సెషన్‌లో ఫ్యాన్స్‌కు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చాడు. అయితే అందులో ఓ అభిమాని ‘జవాన్’ నెక్స్ట్ ట్రైలర్ ఎప్పుడు అని అడగ్గా .. ‘మీకు ట్రైలర్ కావాలా లేక మరో సాంగ్ రిలీజ్ కావాలా? ఏదో ఒకటి నాకు డిసైడ్ చేసి చెప్తే.. నేను దాన్ని డైరెక్టర్ అట్లీ మీదకి తోసేస్తాను’ అంటూ ఫన్ రిప్లయ్ ఇచ్చాడు. దీంతో అభిమానులంతా ఒక్క సారిగా నవ్వుకున్నారు.