మెగా ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!
ప్రముఖ టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు చక్కర్లుకొడుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : గత కొంతకాలంగా ప్రముఖ టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ప్రేమాయణమే కాదు...త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ వార్తలపై నాగబాబు ఫ్యామిలీ ఎప్పుడూ స్పందించలేదు. అంతేకాదు, తాము మంచి స్నేహితులం మాత్రమే అని వరుణ్ తేజ్, లావణ్య చెబుతు వస్తున్నారు. అయితే, తాజాగా ఈ రూమర్స్ అన్నింటిని నిజం చేస్తూ వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈ నెల 9వ తేదీన ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారని విశ్వసనీయ సమాచారం. మొగా ఫ్యామిలీ సభ్యులు, కొంతమంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరుపుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని..వధూవరుల దుస్తులు, ఆభరణాలు ప్రముఖ డిజైనర్స్ రూపొందిస్తున్నారనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఎంగేజ్మెంట్ కుటుంబ సమక్షంలో చేసుకుని...పెళ్లి మాత్రం ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా చేయనున్నారట.
ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ప్రస్తుతం వీరిద్దరూ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారని సమాచారం. అనంతరం వీరి ఎంగేజ్మెంట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తాను రోమ్‌లో ఉన్నానని వరుణ్‌తేజ్...ఇక తాను ప్రయాణంలో ఉన్నట్టు లావణ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో నెటిజన్లు వీరిద్దరూ కలిసే ప్రయాణిస్తున్నట్టు కామెంట్లు చేస్తున్నారు.
Read More... ఆ స్టార్ హీరోయిన్‌కు తల్లిగా నటిస్తున్న సమంత.. ఏ సినిమాలో అంటే?
మెగా ఇంటికి లావణ్య త్రిపాఠీ ఎంత కట్నం తీసుకొస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?