చిరు-బాలయ్య కోసమే 'వారసుడు' వాయిదా వేశాం: దిల్ రాజు

దళపతి విజయ్, రష్మిక ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'వారసుడు'.

Update: 2023-01-09 13:06 GMT

దిశ, సినిమా: దళపతి విజయ్, రష్మిక ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'వారసుడు'. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ పెరల్ వి పొట్లూరి నిర్మించిన సినిమాను తెలుగులో జనవరి 14న విడుదల చేయబోతున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. 'జనవరి 11న తమిళ్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.

అయితే జనవరి 12న 'వీరసింహా రెడ్డి', 13న 'వాల్తేరు వీరయ్య' రిలీజ్ అవుతున్న కారణంగా 'వారసుడు' 14న విడుదల చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి థియేటర్‌లో మన తెలుగు స్టార్స్ సినిమాలు పడాలి. అన్నిచోట్ల వారికి థియేటర్లు దొరకాలి. తర్వాతే మా సినిమా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం' అని క్లారిటీ ఇచ్చాడు. ఇక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందన్న శ్రీకాంత్.. ప్రతిఒక్కరూ ఎమోషనల్‌గా ఫీల్ అవుతారని, చాలారోజులకు ఒక మంచి సినిమా చూసిన అనుభూతి పొందుతారని చెప్పుకొచ్చాడు.

స్ట్రాంగ్ రిలేషన్‌‌ షిప్‌‌ను కోరుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి

Tags:    

Similar News