8 ఏళ్ల తర్వాత లవ్‌లో పడ్డాం.. హీరో భార్య సెన్సేషనల్ కామెంట్స్

‘సక్కరకత్తి’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు కోలీవుడ్ హీరో ‘శాంతను భాగ్యరాజ్’.

Update: 2023-09-19 08:09 GMT
8 ఏళ్ల తర్వాత లవ్‌లో పడ్డాం.. హీరో భార్య సెన్సేషనల్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ‘సక్కరకత్తి’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు కోలీవుడ్ హీరో ‘శాంతను భాగ్యరాజ్’. అప్పటి నుంచి తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే ‘రావణ కొట్టం’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో ‘బ్లూస్టార్’ అనే చిత్రంలో నటిస్తు్న్నాడు. తాజాగా ఈ హీరో.. ఇతని భార్య కికీ విజయ్ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. వారి ప్రేమ, బ్రేకప్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. ‘‘మేం ప్రేమించుకున్నాం. తర్వాత బ్రేకప్ అయ్యింది. దాంతో 8 ఏళ్లు దూరంగా ఉన్నాం. మళ్లీ కలిశాం. గతంలో చిన్న చిన్న విషయాలకే గొడవ పడేవాళ్లం.’ అంటూ శాంతను తెలిపారు.

ఆయన సతీమణి కికీ మాట్లాడుతూ.. ‘‘నేను శాంతను ట్రుగా లవ్ చేశాను. ఆయనతో లవ్‌లో ఉన్నప్పుడు ఓ ఘటన జరిగింది. నాకు బాగా గుర్తుంది. ఆయన వేరే అమ్మాయితో కాఫీ షాపులో ఉన్నాడని.. మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది. నేను వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాను. కానీ ఆయన మా నాన్నతో ఉన్నానని అబద్ధం చెప్పాడు. కాగా ఇలాంటి చిన్న చిన్న విషయాలే గొడవలకు దారితీసేవి. దీంతో బ్రేకప్ చెప్పుకుని.. ఎనిమిదేళ్లు విడిపోయాం. ఓ షోకు ఇద్దరం కలిసి డాన్స్ చేయాల్సి వచ్చింది. అలా మళ్లీ ఒక్కటయ్యాం’’ అంటూ కికీ వెల్లడించింది.


Similar News