మా నాన్న కూడా అలాంటివాడే.. నజీరుద్దీన్ షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రముఖ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తన దివంగత తండ్రి అలీ మహహ్మద్‌తో తనకున్న బంధంపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Update: 2023-06-19 07:27 GMT

దిశ, సినిమా: ప్రముఖ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తన దివంగత తండ్రి అలీ మహహ్మద్‌తో తనకున్న బంధంపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘నిజానికి అందరిలాగే మా పేరెంట్స్ కూడా నన్ను గొప్ప ప్రయోజకుడిని చేయాలనుకున్నారు. అంతకు తగ్గట్లు ప్రణాళికలు రచించుకున్నారు. ముఖ్యంగా మా నాన్న ప్రేమ షరతులతో కూడుకున్నది. నేను బాగా చదివి డాక్టర్ కావాలని కోరుకున్నాడు. కానీ, నేను అటువైపు మొగ్గుచూపలేదు. నా పనులను ఆయన అంగీకరించలేదు. నా పద్ధతులతోపాటు, ప్రతి ప్లాన్ తిరస్కరించాడు. అలా మా మధ్య కాస్త గ్యాప్ ఏర్పడింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే చిన్నప్పటినుంచి తన ఫాదర్ అంటే గౌరవంతో కూడిన భయం ఉండేదని, దీంతో ఆయన కళ్లలోకి కళ్లపెట్టి ఎప్పుడూ చూడలేదని చెప్తూ నసీరుద్దీన్ ఎమోషనల్ అయ్యాడు.

Read More:   అక్షయ్ క్యారెక్టర్‌పై ట్వింకిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పిల్లలకు అవే లక్షణాలంటూ

Full View

Tags:    

Similar News