మళ్లీ ఫామ్‌లోకి మెగాస్టార్.. 100 రోజులు పూర్తవుతున్న థియేటర్‌ల్లో ఆగని ‘వాల్తేరు వీరయ్య’ సందడి

మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్యా’.

Update: 2023-04-23 08:09 GMT
మళ్లీ ఫామ్‌లోకి మెగాస్టార్.. 100 రోజులు పూర్తవుతున్న థియేటర్‌ల్లో ఆగని ‘వాల్తేరు వీరయ్య’ సందడి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్యా’. మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రిలీజైన మొదటి రోజు నుంచి హిట్ టాక్ సాధించి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

కాగా.. నేటికి ఈ సినిమా రిలీజై 100 రోజులు అవుతుంది. ఈ సినిమా చీపురుపల్లి, అవనిగడ్డలో 100 రోజులు ఆడి వైజాగ్‌లో రికార్డు సృష్టించింది. అంతే కాకుండా విడుదలైన 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం విశేషం. ఫుల్ రన్ లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 189.05 కోట్ల గ్రాస్ ను .. ప్రపంచవ్యాప్తంగా 236.15 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ సినిమా 48.5 కోట్ల లాభాలను తెచ్చిపెట్టినట్టుగా తెలుస్తోంది. మెగా స్టార్ మాస్ యాక్షన్, రవితేజ టైమింగ్ ఈ సినిమాకు ప్లెస్ అయినవని చెప్పుకోవచ్చు.

Also Read..

పవన్ కల్యాణ్‌ ఫ్యాన్‌కు ‘OG’ టీమ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ 

Tags:    

Similar News