హిందువుల వల్లే ముస్లింలు ధనవంతులయ్యారు: కొనసాగుతున్న 'ది కశ్మీర్ ఫైల్స్' వివాదం
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సయ్యిద్ అక్తర్ మీర్జా, వివేక్ అగ్నిహోత్రి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
దిశ, సినిమా : బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సయ్యిద్ అక్తర్ మీర్జా, వివేక్ అగ్నిహోత్రి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల సయ్యిద్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో 'ది కశ్మీర్ ఫైల్స్'పై సినిమాపై దారుణమైన కామెంట్స్ చేశాడు. 'నాకు సంబంధించి 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా ఓ చెత్త. కశ్మీరీ పండిట్‌లకు సమస్యలున్నాయి. అది నిజం.. కానీ దీని వల్ల ముస్లింలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, జాతీయ ప్రయోజనాలని చెప్తూ సరిహద్దు అవతల నుంచి వచ్చిన పెయిడ్ బాయ్స్ ట్రాప్‌లో పడి కష్టాలు అనుభవించారు. అందుకే ఏదో ఒక వైపు స్టాండ్ తీసుకుని మాట్లాడకుండా.. మనిషిగా సమస్యని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి' అంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు.
ఇక దీనిపై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయిన వివేక్..'నేను మీర్జా సాబ్‌కి సలామ్ చేస్తున్నా. 'ది ఢిల్లీ ఫైల్స్' తర్వాత మళ్లీ కలుద్దాం సర్. 2024' అంటూ ట్వీట్ చేశాడు. అయితే వెంటనే మరో ట్వీట్ చేసిన వివేక్..'నేను ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పాలనుకోలేదు. ఇప్పుడు కఠినమైన సత్యాన్ని మాట్లాడే సమయం వచ్చిందని భావిస్తున్నా. ఆయన జీవితమంతా ముస్లిం బాధితులపైనే సినిమాలు తీశాడు. భారతదేశంలో మాత్రమే 'ముస్లిం సోషల్' అనే జోనర్ ఉంది. హిందువులే వాళ్లను ధనవంతులుగా, సెలబ్రీటీలుగా మార్చారు. అయినప్పటికీ..కృతజ్ఞత లేని బాలీవుడ్‌కు హిందువులపై ఏ మాత్రం సానుభూతి లేదు' అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేయగా ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Also Read....