ఆ హీరో కోసం తన సినిమా పోస్ట్ పోన్ చేసుకున్న విశ్వక్ సేన్!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘మెకానిక్ రాకీ’.

Update: 2024-09-28 15:32 GMT

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘మెకానిక్ రాకీ’. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇందులో నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో పాజిటివ్ అంచనాలకు క్రియేట్ చెయ్యగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్స్ కూడా సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతున్నాయి. ఇక రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ఇటీవల అక్టోబర్ 31న రిలీజ్ చెయ్యబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ చేంజ్ అయినట్లు తెలుస్తోంది.

అయితే.. దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత వాయిదా పడి అక్టోబర్ 31న రిలజ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ఇక ఒకే రోజు మీనాక్షీ చౌదరి నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి అనుకునే సమయంలో.. విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ వాయిదా పడినట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో కూడా ప్రేక్షకాదరణ బాగానే ఉండటంతో.. విశ్వక్ సేన్, చిత్ర బృందం తమ సినిమా రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేసుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. అందులోనూ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే.. ‘లక్కీ భాస్కర్’, ‘మెకానిక్ రాకీ’ ఈ రెండు సినిమాలకు నష్టం వచ్చే అవకాశం ఉన్న కారణంగా విశ్వక్ ఈ నిర్ణయం తీసుకున్నాడని మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత వరకు ఉందో తెలియాలంటే ‘మెకానిక్ రాకీ’ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. 

Tags:    

Similar News