Vishwak Sen: ‘మెకానిక్ రాకీ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీలో ‘మెకానిక్ రాకీ’గా అలరించబోతున్నాడు.

Update: 2024-07-18 14:20 GMT

దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీలో ‘మెకానిక్ రాకీ’గా అలరించబోతున్నాడు. దీనికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తుండగా.. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. హై బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మూవీపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా.. మెకానిక్ రాకీ విడుదల తేదిని ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్నట్లు తెలిపారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ గన్, రెంచ్‌ను పట్టుకుని బాడ్ యాస్ అవతార్‌లో కనిపించారు. మెకానిక్‌గా తన క్యారెక్టర్ ప్రజెంట్ చేస్తూ, పోస్టర్‌లో ఓల్డ్ కార్స్ కూడా ఉన్నాయి.

 

Tags:    

Similar News