లాయర్ పాత్రలో Vishwak Sen ?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా సొంతగా పేరు సంపాదించుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా సొంతగా పేరు సంపాదించుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ప్రస్తుతం విశ్వక్ సేన్ అంటే తెలియని వాళ్లంటూ ఎవరు లేరు. రీసెంట్ గా వచ్చిన ఓరి దేవుడా సినిమా తో హిట్టును అందుకొని వరుస సినిమాలతో అలరించనున్నాడు. ప్రస్తుతం విశ్వక్ " ముఖ చిత్రం " సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేసారు. ట్రైలర్ లో విశ్వక్ లాయర్ పాత్రలో దర్శనమిచ్చారు. చూస్తుంటే ఈ సినిమాలో ఊహించలేని ట్విస్టులు చాలానే ఉన్నట్టు తెలుస్తుంది. చనిపోయిన అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు..ఈ క్రమంలో కథంతా తిరుగుతూ ఉంటుంది. సందీప్ రాజ్ ఈ సినిమా మాటలు రాసారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు గంగాధర్ పరిచయమవుతున్నారు.