‘#VS 11’నుంచి బిగ్ అప్‌డేట్.. ‘శివాలెత్తి పోద్ది’ అంటున్న హీరో

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్‌సేన్.. కెరీర్ మొదటినుంచి తన సినిమాల్లో వేరియేషన్స్ చూపిస్తున్నాడు.

Update: 2023-05-28 08:47 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్‌సేన్.. కెరీర్ మొదటినుంచి తన సినిమాల్లో వేరియేషన్స్ చూపిస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’తో హిట్ అందుకున్న విశ్వక్ తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ‘#VS 11’ నుంచి రీసెంట్‌గా ‘గంగానమ్మ జాతర మొదలయ్యింది.. ఈసారి శివాలెత్తి పోద్ది’ అనే క్యాప్షన్‌తో ఒక ఫొటో రివిల్ చేశాడు. అలాగే ఆదివారం సాయంత్రం 4:05 నిమిషాలకు మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

Tags:    

Similar News