ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ను రివీల్ చేసిన విశ్వక్ సేన్.. పోస్ట్ వైరల్

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో ‘దేవర’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది.

Update: 2024-04-03 09:33 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో ‘దేవర’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ అన్నీ ఫ్యాన్స్‌లో హైప్‌ను క్రియేట్ చేశాయి. దీంతో దేవర ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దేవర అప్డేట్ రివీల్ చేశాడు.

అయితే ఎన్టీఆర్, విశ్వక్, సిద్దు జొన్నలగడ్డ, నాగవంశీ ఏప్రిల్ 2న పార్టీ చేసుకున్నట్లు సమాచారం. ఇందులో అనిరుద్ పాడిన పాటలు అందరూ విన్నట్లు తెలుస్తోంది. దీంతో విశ్వక్ ఇదే విషయాన్ని తెలుపుతూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. అంతేకాకుండా ఎన్టీఆర్‌తో సన్నిహితంగా దిగిన పిక్ కూడా పోస్ట్‌లో జత చేశాడు. ‘‘ దేవర మ్యూజిక్ ఉందమ్మా నెక్స్ట్ లెవెల్ అంతే. అనిరుద్ ఇరగొట్టేశాడు. ఈ ఆల్బమ్ ప్రతి ఇక్కిరికీ నచ్చేస్తుంది’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ మీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయాలని రిక్వెస్టులు పెడుతున్నారు. చూడాలి మరి విశ్వక్ వారి కోరికను తీరుస్తాడా లేదా అనేది.


Similar News