దీపిక నా కన్న ఎక్కువే తీసుకుంది.. ఆ విషయంలో మాట్లాడే అర్హత లేదు..

బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే రెమ్యూనరేషన్‌ విషయంలో ఆడ, మగ వ్యత్యాసం గురించి మాట్లాడాడు.

Update: 2023-04-21 11:21 GMT
దీపిక నా కన్న ఎక్కువే తీసుకుంది.. ఆ విషయంలో మాట్లాడే అర్హత లేదు..
  • whatsapp icon

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే రెమ్యూనరేషన్‌ విషయంలో ఆడ, మగ వ్యత్యాసం గురించి మాట్లాడాడు. ఇండస్ట్రీలో 15-20 ఏళ్లుగా పనిచేస్తున్న తాను ఇన్నాళ్లు సహనటీమణుల కంటే తక్కువే తీసుకున్నానని.. కానీ ఈ విషయంలో రచ్చ చేయాలనుకోలేదని చెప్పాడు. అయితే బీటౌన్‌కు చెందిన A-లిస్టెడ్ హీరోయిన్స్ పే పారిటీ గురించి మాట్లాడటం హాస్పాస్పదంగా ఉందన్నాడు. తనతో కలిసి వర్క్ చేసిన చాలా మంది హీరోయిన్స్ తన కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారని.. ముఖ్యంగా దీపిక ‘ఛపాక్’ సినిమాకు తీసుకున్న జీతంపై క్లారిటీ ఇచ్చాడు విక్రాంత్.

Tags:    

Similar News