'నరేష్, పవిత్రల గురించి విజయ నిర్మలకు ముందే తెలుసు'
నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి క్లారిటీ ఇస్తూ డిసెంబర్ 31న లిప్ కిస్‌తో పెళ్లి ప్రకటన కూడా చేశారు వీరిద్దరు.
దిశ, వెబ్‌డెస్క్: నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి క్లారిటీ ఇస్తూ డిసెంబర్ 31న లిప్ కిస్‌తో పెళ్లి ప్రకటన కూడా చేశారు వీరిద్దరు. ఇక నరేష్ ప్రకటనపై కొన్ని రోజులకు స్పందించిన రమ్య అతడిపై అనేక ఆరోపణలు కూడా చేసింది. తనపై తప్పుడు కేసులు పెడుతున్నాడని, కృష్ణతో అక్రమ సంబంధాలు అంటగట్టాడని తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలోనే మరోసారి నరేష్‌పై ఆరోపణలు చేసింది రమ్య.
తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. నరేష్ నా నుంచి విడాకులు కావాలని పిటిషన్ వేశారు. అలాగే పిల్లాడి గార్డియన్షిప్పై ఇంజక్షన్ ఆర్డర్‌కి పిటిషన్ వేశారు. ''అతడు నాపై వేసిన కేసులన్నీ నేను ఎదుర్కొంటాను. కానీ.. నరేష్ నాపై ఆరోపణలు చేసి ఆరు నెలలు అవుతున్నా వాటిని నిరూపించలేక పోయాడు. నరేష్, పవిత్ర అక్రమ సంబంధం గురించి విజయ నిర్మలకు ముందే తెలుసు. నరేష్ ఎప్పటికైనా మారతాడు.. నువ్వు ధైర్యంగా ఉండు అని నిర్మల గారు నాకు సర్ది చెప్పేవారు. ఇప్పుడు ఆమె చనిపోవడంతో నరేష్ ఆగడాలకు అడ్డులేకుండా పోతుంది. విజయనిర్మల బతికి ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు'' అంటూ చెప్పుకొచ్చింది రమ్య రఘుపతి.
ఇవి కూడా చదవండి :కామాన్ని రెచ్చగొట్టే పాత్రలు చేయాలనుంది : మాజీ మిస్ ఇండియా