విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్.. మొదటి సారి పేరెంట్స్‌ని అంటూ
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
దిశ, సినిమా: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన ఫ్యామిలి స్టార్ సినిమా యావరేజ్ టాక్‌గా నిలవగా ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్‌గా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలితో కలిసి అమెరికా వెకేషన్‌కి వెళ్లాడు. విజయ్, ఆనంద్, తమ పేరేంట్స్ నలుగురు కలిసి వెకేషన్‌కి వెళ్లారు.
అమెరికాలో విజయ్ దేవరకొండ కోసం అక్కడి తెలుగు వాళ్ళు చేసిన హంగామా ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ ఫ్యామిలీ అమెరికా వెకేషన్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. ఈ క్రమంలో తాజాగా విజయ్ దేవరకొండ అమెరికాలో తన పేరెంట్స్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. మా అమ్మానాన్నలను మొదటి సారిగా అమెరికా తీసుకెళ్లాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అది చూసిన నెటిజన్లు అమ్మానాన్నలను విజయ్ ఎంత బాగా చూసుకుంటున్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటోలను చూసేయండి.