విజయ్ దేవరకొండ vs అనసూయ.. ట్విట్టర్‌లో బండ బూతులు!

బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2023-05-06 03:46 GMT

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పోస్టులతో వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఇటీవల తనను ఆంటీ అన్న వారిపై కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా, అనసూయ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై సంచలన ట్వీట్ చేసి చిక్కుల్లో పడింది. ఖుషి పోస్టర్ THE విజయ్ అని పేర్కొనడాన్ని ఉద్దేశించి అనసూయ ఓ పోస్ట్ పెట్టింది. ‘ఇప్పుడే ఒకటి చూశాను. THE నా? బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం అంటకుండా చూసుకుందాం’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో అది చూసిన విజయ్ ఫ్యాన్స్ ‘ఆంటీ’ ని ట్రెండ్ చేస్తామంటూ నీకు ఇవన్నీ అవసరమా అంటూ ఫైరవుతున్నారు. తాజాగా, మరోసారి అనసూయ ‘‘భలే రియాక్ట్ అయ్యారు దొంగ.. ఊప్స్ బంగారుకొండలంతా నేను అనేది నిజమని నిరూపిస్తున్నారు’’ అని ట్వీట్ చేసింది.


Also Read..

సాయిపల్లవి రిజెక్ట్ చేసిన ‘ఆ సీన్‌’లో నిహారిక.. ‘పుష్ప 2’ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ 

Tags:    

Similar News