నయనతారపై విఘ్నేశ్ స్పెషల్ పోస్ట్..

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ నయనతార టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఎట్టకేలకు ఒక్కటి కాబోతున్నారు. ఈ రోజు(జూన్‌ 9న) నయన్‌-విఘ్నెశ్‌ మహాబలిపురంలోని ఓ రీసార్ట్‌లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు..Latest Telugu News

Update: 2022-06-09 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ నయనతార టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఎట్టకేలకు ఒక్కటి కాబోతున్నారు. ఈ రోజు(జూన్‌ 9న) నయన్‌-విఘ్నెశ్‌ మహాబలిపురంలోని ఓ రీసార్ట్‌లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొద్ది గంటలకు ముందు విఘ్నేశ్‌ కాబోయే భార్య నయన్ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్‌ పోస్ట్‌ చేశాడు. ''ఈ రోజు జూన్‌ 9.. ఇది నయన్ లవ్‌. థ్యాంక్యూ గాడ్‌... నా జీవితాన్ని దాటిన అందమైన వ్యక్తులు, విశ్వం, సంకల్పానికి ధన్యవాదాలు !! ప్రతి మంచి ఆత్మ, ప్రతి మంచి క్షణం, ప్రతి మంచి యాదృచ్చికం, ప్రతి ఆశీర్వాదం, ప్రతిరోజూ షూటింగ్‌, ప్రార్థనలు నా జీవితాన్ని ఇంత అందంగా మార్చాయి. వీటిన్నింటికి నేను కృతజ్ఞుతుడిని. ఇప్పుడు, ఇదంతా నా జీవితంలోని నయనతారకు అంకితం. మరి కొద్ది గంటల్లో వధువుగా నిన్ను చూసేందుకు పరితపిస్తున్న తంగమై'' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.


Similar News