మా లైఫ్‌లో అత్యంత సంతోషకరమైన మూడు రోజులు అవే.. విక్కీ

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మరోసారి తన భార్య, నటి కత్రినా కైఫ్‌తో తనకున్న అనుంబంధాన్ని పంచుకున్నాడు.

Update: 2023-08-26 07:18 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మరోసారి తన భార్య, నటి కత్రినా కైఫ్‌తో తనకున్న అనుంబంధాన్ని పంచుకున్నాడు. భార్య పట్ల తనకున్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తపరిచాడు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్కీ.. తనకు సంబంధించిన ఏ గుడ్ న్యూస్ అయినా మొదట కత్రినతోనే షేర్ చేసుకుంటానని చెప్పాడు.

అలాగే తన జీవితంలో వివాహాన్ని అత్యంత విలువైన జ్ఞాపకంగా పేర్కొన్న ఆయన.. ‘కత్రినతో నా పెళ్లి మోస్ట్ వాల్యూయబుల్ మెమొరీస్‌లో ఒకటి. అవి నా లైఫ్‌లో అత్యంత సంతోషకరమైన మూడు రోజులు కూడా. నేను కత్రినతో నా మొదటి ఆడిషన్‌ చేసినప్పుడు దాని గురించి మా అమ్మకు చెప్పాను. ఆమె ఆనందంతో డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అలాంటి అనేక క్షణాలు నా జీవితంలో ఎన్నో ప్రత్యేక మధురానుభూతుల్ని అందించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమెతో గడిపే క్షణాలన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి. ఈ విషయంలో నేను నిజంగా అదృష్టవంతుడిని’ అంటూ చెప్పుకొచ్చాడు విక్కీ.

Read More:   మా వక్షోజాలు చూస్తే మీకెందుకు అంత భయం? బాడీ షేమింగ్‌పై నటి ఫైర్


Similar News