Katrina Kaif : కత్రినాకు నేను పర్ఫెక్ట్ కాదు: విక్కీ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటి, భార్య కత్రినా కైఫ్‌తో తనకున్న బంధం గురించి విక్కీ కౌశల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్కీ పెళ్లి
దిశ, సినిమా: బాలీవుడ్ నటి, భార్య కత్రినా కైఫ్‌తో తనకున్న బంధం గురించి విక్కీ కౌశల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్కీ పెళ్లి తర్వాత తమ జీవితం గురించి వివరంగా మాట్లాడాడు. 'నేను ఆమెకు పరిపూర్ణ భర్తను కాదని భావిస్తాను. ఎందుకంటే భార్యను అమితంగా ప్రేమిస్తున్నానని చెప్పినప్పటికీ 'ప్రేమలో ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ తమకు తాముగా ఉత్తమ వెర్షన్' అని చెప్పుకోకూడదని నమ్ముతాను. అంతేకాదు ఒక భాగస్వామిగా ఆమెకు చేయగలిగిన సాయం చేయడానికి ప్రయత్నిస్తా.
ఒంటరిగా ఉన్నప్పటికంటే వివాహం అయిన తర్వాతే చాలా విషయాలు నేర్చుకున్నా. అందుకే ఆమె నాకు పర్ఫెక్ట్ వైఫ్‌గా ఫీల్ అవుతా. భర్తగా, కొడుకుగా, స్నేహితుడిగా, నటుడిగా ఇలా ఏ రోల్లోనూ నేను పర్ఫెక్ట్ పర్సన్ కాదు. అన్ని రకాలుగా ఉత్తమ స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నిస్తా. నిన్నటికంటే రేపు మరింత మెరుగ్గా ఉండాలనుకుంటున్నా' అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చాడు.